పత్తి రైతుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు
November 18, 2025
రైతు దగ్గర పత్తి కొనుగోలుపై కేంద్ర. రాష్ట్ర నిబంధనలు సరికాదు అని జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ Dr కొడుగల్ యాదయ్య అన్నారు. రైతులు ఆరుగాలం కష్టం చేసి వానకు నాని ఎండకు ఎండి, రాత్రి పగలు కష్టపడి పండించిన పత్తి పంటను అమ్మడానికి పోతే ఇన్ని పరిక్షలు పెట్టి కొనడం చాలా బాధాకరం అని అన్నారు.ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొంటాం మిగతాది దళారీలకు అమ్ముకోమనడం చిగుచేటైన పని అని ఇక చూస్తూ కోరుకునేదే లేదు అని ఈ రోజు BRS పార్టీ రైతుల పక్షాన జడ్చర్ల ఇండ్రస్ట్రియల్ దగ్గర ఉన్న పత్తి కొనుగోలు (జిన్నింగ్ మిల్) కేంద్రం దగ్గర ఉన్న రైతుల తరుపున మాట్లాడం జరిగింది. రైతు పండించిన పత్తిని ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా గొణుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతమన్నారు ఈ సందర్భంగా తెలియజేశారు
Tags
