జడ్చర్లలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం అమరవీరులకు ఘన నివాళి

జడ్చర్లలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం అమరవీరులకు ఘన నివాళి

TBN LIVE

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ సేవల శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (SFO) పి. రాజేందర్ అగ్నిమాపక పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అగ్నిమాపక సిబ్బందిని స్మరిస్తూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్చర్ల సీఐ కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రజలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!