జడ్చర్ల పట్టణంలోని విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు శుభవార్త. డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్లలో కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ స్టడీస్ విభాగంలో ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ అధికారి శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమంగా నిలవనుంది.
ఈ ఉచిత కోచింగ్ తరగతులు జనవరి 8, 2026 నుండి ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. తరగతుల్లో భారత చరిత్ర, భారత రాజ్యాంగం, భారత భూగోళ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, సాధారణ విజ్ఞానం, అర్థమేటిక్ మరియు రీజనింగ్,సమకాలీన అంశాలు వంటి జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సులభంగా, లోతుగా బోధించనున్నారు. ముఖ్యంగా UPSC, TSPSC, APPSC, గ్రూప్ పరీక్షలు, కానిస్టేబుల్,SI,SSC, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కోచింగ్ ఎంతో దోహదపడనుంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కళాశాలలో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ సువర్ణ అవకాశాన్ని జడ్చర్ల పట్టణంలోని నిరుద్యోగ యువత కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆమె సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారని, విద్యార్థులు క్రమశిక్షణతో తరగతులకు హాజరై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
