జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తా-పాత బజార్ రోడ్డు 10 రోజులు బంద్

జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తా-పాత బజార్ రోడ్డు 10 రోజులు బంద్

TBN LIVE
జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తా-పాత బజార్ రోడ్డు 10 రోజులు బంద్: స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులతో ట్రాఫిక్ ఆంక్షలు
రేపటి నుంచి గౌడ ఫంక్షన్ హాల్ వద్ద రాకపోకలు నిలిపివేత, ప్రత్యామ్నాయ మార్గాలు వాడుకోవాలని సూచన
జడ్చర్ల ; మే 25: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బజార్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. గౌడ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ మార్గం 10 రోజుల పాటు రాకపోకలకు అందుబాటులో ఉండదని కాంట్రాక్టర్ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని కాంట్రాక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే డ్రైనేజీ పనుల కారణంగా నేతాజీ చౌరస్తా నుండి సిగ్నల్ గడ్డ వరకు ఈ రహదారి ఇరుకుగా మారింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు రోడ్డు మధ్యలోనే వ్యాపారం నిర్వహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన వ్యాపారం చేయాలని సూచించినా కొందరు వ్యాపారులు "మా ఇష్టం" అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల అంబులెన్స్‌లు, ద్విచక్ర వాహనాలు, స్కూల్ బస్సులు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!