జడ్చర్ల లో దారుణం ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

జడ్చర్ల లో దారుణం ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

TBN LIVE
జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి
సెజ్లో ని ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. కంప్యూటర్ ఇంజనీర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం అధికారికంగా వివరాలు వివరించకపోవడం, మీడియా ని లోపలికి అనుమతించకపోవడం తో పలు అనుమానాల కు దారితీస్తుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన రోనాక్ రాజ్ (20) జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్లో నిర్వహిస్తున్న ఎస్వీకేయం నిమ్స్ హైదరాబాద్ బ్రాంచ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.శనివారం యూనివర్సిటీ లో సెమిస్టర్ ఎగ్జామ్ ఉండగా పరీక్ష సమయంలో చీటీ కొడుతూ పట్టు పడ్డట్టు.సమాచారం.దీంతో విద్యార్థి యూనివర్సిటీ తన హాస్టల్ గదికి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి విషయాన్ని బయటికి తెలియకుండా ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మీడియా విద్యార్థి సంఘాలు ఎస్వీకేయం నిమ్స్ యూనివర్సిటీ వద్దకు చేరుకోగా.. యజమాన్యం వారిని యూనివర్సిటీ లోపలికి అనుమతించకుండా సెక్యూరిటీ గార్డ్ తో గేటు వద్దనే ఉంచారు. దీంతో విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఇదే యూనివర్సిటీలో గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వలేదని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన తర్వాత కూడా యూనివర్సిటీలోకి ఎవరిని అనుమతించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పూర్తి సమాచారం వెల్లడించాలని పారదర్శక విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి జడ్చర్ల పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవడంతో బయట నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలం వద్దకు వెళ్లి విచారణ చేపడుతున్నట్లు పట్టణ సీఐ కమలాకర్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!