నెక్కొండలో ఘనంగా ‘వికసిత్ గ్రామీణ్ పంచాయతీ ప్లాన్’ గ్రామ సభ

నెక్కొండలో ఘనంగా ‘వికసిత్ గ్రామీణ్ పంచాయతీ ప్లాన్’ గ్రామ సభ

TBN LIVE
నెక్కొండలో ఘనంగా ‘వికసిత్ గ్రామీణ్ పంచాయతీ ప్లాన్’ గ్రామ సభ
నెక్కొండ గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం మంగళవారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'వికసిత్ గ్రామీణ్ పంచాయతీ ప్లాన్' (VB-GRAM G) కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ గ్రామ సభలో ప్రభుత్వం అనుమతించిన 318 పనుల జాబితా ఆధారంగా, నెక్కొండ గ్రామానికి అత్యంత అవసరమైన మరియు ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనులను గుర్తించారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొని, ప్రణాళిక రూపకల్పనపై ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలను సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.ఈ గ్రామ సభకు గ్రామ ప్రజలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, యువతీ యువకులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామస్థులందరూ చొరవ తీసుకుని, గ్రామాభివృద్ధికి తోడ్పడే తమ విలువైన సూచనలు, సలహాలను అందించి ఈ ప్రణాళిక తయారీని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!