పోస్టుమార్టం నిమిత్తం వచ్చిన శవాన్ని కుక్కలు పీక్కుని తిన్న ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించారు.ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎనీ రవిప్రకాష్ల పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్వహణ తీరు లో ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని గత ఆరు నెలల క్రితమే వంద పడకల హాస్పిటల్ నూతన పోస్టుమార్టం గది ఆసుపత్రికి కాంట్రాక్టర్ అప్పగించినా కూడా, నూతన పోస్టుమార్టం గదిలో పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో పాటు నూతనంగా వచ్చిన ఫ్యూచర్లను ప్రారంభించకపోవడంతోనే నేడు ఈ ఘోరమైన ఘటన జరిగినట్లు ఆయన వివరించారు. దీంతోపాటు ఆసుపత్రిలో వైద్యుల పనితీరు సరిగా లేదని, ఆస్పత్రి నిర్వహణ తీరు సరిగా లేదని అన్నారు. ఈ ఘటనపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు.
<
