జడ్చర్ల, ఆగస్టు 23:
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 167వ జాతీయ రహదారిపై స్నేహ కంపెనీ సమీపంలోని ప్లే జోన్ వద్ద ఒక మినీ బజాజ్ ఆటోను భారీ లారీ బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల గౌరీ శంకర్ కాలనీకి చెందిన మహేష్ (22), ఆలూరు తండాకు చెందిన గణేష్ (22)తో పాటు మరో వ్యక్తి కలిసి మినీ ఆటోలో గంగాపురం చెన్నకేశవ స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి జడ్చర్లకు వస్తుండగా, ఆదివారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన భారీ లారీ ఆటోను డీకొట్టడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, గణేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే గణేష్ పరిస్థితి మరింత క్షీణించి మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.