జడ్చర్ల, అక్టోబర్ 31: జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ జిల్లా జెడ్పిటిసి చైర్మన్ కోడుగల్ యాదయ్య మేనత్త విలువల చంద్రమ్మ (70) శనివారం ఉదయం హఠాన్మరణం చెందారు. చంద్రమ్మ మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కోడుగల్ యాదయ్య హుటాహుటిన నెక్కొండ గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.మృతురాలి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
జడ్చర్ల మండలం నెక్కొండలో విషాదం - మాజీ జెడ్పిటిసి చైర్మన్ మేనత్త మృతి
October 31, 2026
Tags
