పెద్దగుట్ట ధ్వజస్తంభంపై వివాదం - కమిటీ సభ్యుడు కాల్వ రామ్ రెడ్డి క్లారిటీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శ్రీ రంగనాయక స్వామి పెద్దగుట్టపై ధ్వజస్తంభం ఏర్పాటుపై జరుగుతున్న వివాదంపై కమిటీ సభ్యుడు కాల్వ రామ్ రెడ్డి స్పందించారు.సోమవారం పెద్దగుట్ట పైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధ్వజస్తంభం ఏర్పాటు విషయంలో కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు.150 మంది సమక్షంలో, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మమ్మ సాక్షిగా ఎమ్మెల్యే గారికి ఆహ్వాన పత్రాలు అందజేసి, అందరి అంగీకారంతోనే కార్యక్రమం ప్రారంభించామని స్పష్టం చేశారు.
ఎండోమెంట్ అధికారుల అనుమతులు, ముహూర్తాలు, శిల్పుల సలహా మేరకే శాస్త్రోక్తంగా రాతి ధ్వజస్తంభాన్ని నిర్మించామని, అన్ని దేవాలయాల్లోనూ ఇదే పద్ధతి పాటిస్తారని తెలిపారు.గుట్టపై కార్యక్రమం జరుగుతుందని తెలిసి కూడా తెలియనట్లుగా ఉండి, ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చి రంగుల ఫోటోలు చూపిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు.
దేవుడి విషయంలో రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
