జడ్చర్ల పోలీసులు సమర్ధవంతంగా పనిచేసి, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
1. రాసూరి హరికృష్ణ (26): ఏటీగడ్డపల్లి, అన్నమయ్య జిల్లా (ముఠా . పాత నేరస్థుడు).
2. షేక్ ఇసాక్ (22): మదనపల్లి, అన్నమయ్య జిల్లా.
3. మూడే లక్ష్మణ్ నాయక్ (33): మదనపల్లి. అన్నమయ్య
కేసు వివరాలు: నిందితులు ముగ్గురు ఆన్లైన్ గేమింగ్ (లోడో, పేకాట) కు అలవాటు పడి భారీగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి దొంగతనాల బాట పట్టారు.
ఫిబ్రవరి 16: కర్నూలులో బైక్ దొంగిలించి, గోనెగండ్లలో ఒక మహిళ మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.ఫిబ్రవరి 25: ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో యూనికార్న్ బైక్ (TS33B3927) దొంగతనం చేశారు.
ఫిబ్రవరి 27: జడ్చర్ల కృష్ణారెడ్డి నగర్ కాలనీలో టైలర్ షాపులో ఉన్న మహిళను నీళ్ల బాటిల్ అడిగే నెపంతో నమ్మించి, ఆమె మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పారిపోయారు.వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మార్చి 03 సాయంత్రం జడ్చర్ల ఎస్సై కె. మల్లేష్ గారు మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్నవి:
4 తులాల బంగారు ఆభరణాలు (రెండు తులాల గొలుసు + రెండు తులాల పుస్తెల తాడు).
నేరానికి ఉపయోగించిన హోండా యూనికార్న్ బైక్.
తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్సై మల్లేష్ గారు మరియు వారి సిబ్బందిని పై అధికారులు అభినందించారు.
నోట్ ;ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
