నెక్కొండ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
March 05, 2026
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం: నెక్కొండ గ్రామ ప్రాథమి కొనత పాఠశాల లో గురువారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కటి పాఠాలు బోధించారు. వారి బోధన చూస్తూ పాఠశాల యజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించినందుకు విద్యార్థిని విద్యార్థులు ఆనందం లో మునిగిపోయారు. పాఠశాలను సందర్శించిన మండల ఎం,ఈ,ఓ మంజుల దేవి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ అనంతప్ప విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గౌడ్ ఉపాధ్యాయురాలు అమూల్య ,చంద్ర రేఖ తదితరులు పాల్గొన్నారు.
Tags
