జడ్చర్ల పోలపల్లి పరిశ్రమ వ్యర్థాల నిర్వహణపై మంత్రి కొండా సురేఖ సీరియస్

జడ్చర్ల పోలపల్లి పరిశ్రమ వ్యర్థాల నిర్వహణపై మంత్రి కొండా సురేఖ సీరియస్

TBN LIVE

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పరిధిలోని పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి లెదర్ పార్క్ భూముల్లో అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను పారబోస్తున్న ఘటనపై ఆమె స్పందించారు.
ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకే దిక్కులేదా?
స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు స్పందించకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోని అధికారులు, ఇక సామాన్య ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అని ఆమె నిలదీశారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశాల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య నియంత్రణపై మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అలాగే 'రెడ్ జోన్' పరిశ్రమల ప్రతినిధులు కూడా ఈ భేటీకి రావాలని సూచించారు. పరిశ్రమల వ్యర్థాల నిర్వహణపై ఈ సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగానే కంపెనీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం
మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, అటు కంపెనీ యాజమాన్యాల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. గురువారం రాత్రి పోలేపల్లి సెజ్ లోని ఓ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ వ్యర్థాలను కిష్టారం వాగులో రాత్రికి రాత్రే తగులబెట్టారు. ఈ ఘటనపై స్థానిక గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు తరలించకుండా గ్రామాల సమీపంలోనే వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు తమ పద్ధతి మార్చుకోకపోతే కంపెనీల ముందు భారీ ఎత్తున నిరసన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!