30 ఏళ్ల నిరీక్షణకు తెర: దుందుభి నదిపై వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు

30 ఏళ్ల నిరీక్షణకు తెర: దుందుభి నదిపై వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు

TBN LIVE
జూలై 10: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. గత 30 సంవత్సరాలుగా గ్రామ సమీపంలోని దుందుభి నదిపై వంతెన (బ్రిడ్జి) నిర్మాణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న స్థానికుల కల సాకారమైంది. స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి.నదిపై బ్రిడ్జి లేకపోవడంతో ఇన్నేళ్లుగా వర్షాకాలంలో నెక్కొండ గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిధులు కేటాయించడంపై నెక్కొండ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యను గుర్తించి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాధికారులకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది: గ్రామ సర్పంచ్ కె కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... "గత మూడు దశాబ్దాలుగా మా గ్రామ ప్రజలు పడుతున్న నరకయాతనకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించింది. వర్షాకాలం వస్తే దుందుభి నది దాటడానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వచ్చేది. ఎంతోమంది నాయకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కానీ మా కష్టాలను అర్థం చేసుకుని, రూ.4.50 కోట్ల భారీ నిధులను కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వంతెన నిర్మాణంతో మా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి. త్వరలోనే పనులను ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి" అని కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!