విజయానికి ప్రోత్సహిస్తూ శాలువాతో సత్కరించిన గ్రామస్తులు

విజయానికి ప్రోత్సహిస్తూ శాలువాతో సత్కరించిన గ్రామస్తులు

TBN LIVE


తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తే యువత ఏదైనా సాధించగలరని, దానికి తానే ఉదాహరణ అని 2024 డిసెంబర్ లో సెలెక్ట్ అయి 8 నెలలు శిక్షణ పొంది ఈ నెల మూడున ఎంపికై పిఓపికి ఆర్మీ పోస్టింగ్ జీ.డీ కి ఎంపికైన బండరి మధు అన్నారు. జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామానికి చెందిన బండరి మధు ను శనివారం ఘనంగా గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ.తల్లిదండ్రులు నిరుత్సాహపరచకుండా, ఆత్మవిశ్వాసం కల్పిస్తే ఎన్నో విజయాలను సాధించవచ్చుని పేర్కొన్నారు.నెక్కొండ గ్రామం గర్వకారణంగా నిలిచింది. తండ్రి బండరి మల్లయ్య తల్లి బండరి ఎల్లమ్మ గార్ల రెండో కుమారుడు నెక్కొండ గ్రామానికి చెందిన ప్రతిష్ఠాత్మకంగా కావడం విశేషం. చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాన్ని కలగనుకున్న మధు కష్టపడి చదువుతూ పట్టుదలతో ముందుకు సాగారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో చదివిన ఫలితమే ఈ గొప్ప విజయం. మధు విజయంతో నెక్కొండ గ్రామం, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. "తన కృషితో, కట్టుదిట్టమైన శ్రమతో సాధించిన ఈ విజయాన్ని చూసి యువత ప్రేరణ పొందాలి" అని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ వర్గం, బంధువులు, స్నేహితులు అందరూ మధు కు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!