ప్రస్తుతం, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి మరియు ప్రజలలో భద్రతా భావాన్ని కలిగించడానికి శనివారం జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్, గంగాపూర్ గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించారు.ఎన్నికల భద్రత స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మరియు సీఐ కమలాకర్ వెల్లడించారు.ఇటీవల తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలలో పోలీసులు సాయుధ బలగాలతో కలిసి ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ ర్యాలీని నిర్వహించారు.దీని ముఖ్య ఉద్దేశం ప్రజలలో ధైర్యం నింపడం, శాంతిభద్రతలకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా కల్పించడం, మరియు ఓటర్లు ఎటువంటి భయం లేకుండా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకునేలా ప్రోత్సహించడం ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య లక్ష్యాలు అని తెలిపారు. అందుకు ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
