ప్రతి గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించాలి [

ప్రతి గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించాలి [

TBN LIVE
ప్రతి గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించాలి మండల గౌడ్ సేన నాయకులు నాగరాజ్ గౌడ్ పిలుపు కావలసిన వారికి ఉచితంగా జెండాలు, కండువాల పంపిణీ
ఈనెల ఆగస్టు 18న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల గౌడ్ సేన నాయకులు నాగరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. 'జై గౌడ సేన' ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరపాలని ఆయన కోరారు.ఈ వేడుకల నిర్వహణకు అవసరమైన జెండాలు, కండువాలను కమిటీల సభ్యులకు మరియు యువతకు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా జెండాలు, కండువాలు కావలసిన వారు నాగరాజ్ గౌడ్ గారిని నేరుగా సంప్రదించి తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం మరియు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9666691191 కు కాల్ చేయవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గౌడ బంధువులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని నాగరాజ్ గౌడ్ కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!