జడ్చర్ల; విజయ డైరీ ముందు పాడి రైతుల ధర్నా:

జడ్చర్ల; విజయ డైరీ ముందు పాడి రైతుల ధర్నా:

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నెక్కొండ గ్రామంలో విజయ డైరీ ముందు పాడి రైతుల ధర్నా చేపట్టారు ఎస్ఎన్‌ఎఫ్, ఫ్యాట్ రాకుండా యంత్రాల ఏర్పాటుపై ఆగ్రహం నెక్కొండ విజయ డైరీ ముందు బుధవారం పాడి రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. గత కొన్ని రోజులుగా పాలలో ఎస్ఎన్‌ఎఫ్ (SNF), ఫ్యాట్ శాతాలు సరిగ్గా రాకుండా డైరీ యజమాన్యం మెషిన్లు ఏర్పాటు చేసిందని వారు ఆరోపించారు. ఈ చర్య వల్ల తమ నోట్లో మట్టి కొడుతున్నారంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కష్టపడి పాలు పితకగా, యంత్రాల సాకుతో నాణ్యతను తగ్గించి చూపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై విజయ డైరీ యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమకు ఎస్ఎన్‌ఎఫ్, ఫ్యాట్ ఆధారంగా రావాల్సిన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!