TG కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ఆంక్షలు ఈనెల 31 వరకే

TG కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ఆంక్షలు ఈనెల 31 వరకే

TBN LIVE
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు ఖరారు
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా దీనిపై కొన్ని ఆంక్షలు విధించింది. అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీ లోపు మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలని స్పష్టం చేసింది.
తొలిదశలో వీరికే ప్రాధాన్యం
ప్రభుత్వం చేపట్టే ఈ పెన్షన్ల పంపిణీలో మొదటి విడతగా కొన్ని ప్రత్యేక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అందులో:
  • ఒంటరి మహిళలు
  • వితంతువులు
  • దివ్యాంగులు
  • చేనేత కార్మికులు
  • గీత కార్మికులు
  • ఫైలేరియా బాధితులు
  • తలసీమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు
పరిశీలన తర్వాతే మంజూరు
వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అర్హతలను నిర్ధారించుకున్న తర్వాతే కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నారు. ఈ మొదటి విడత ప్రక్రియ పూర్తయిన తర్వాత, మిగిలిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!