జడ్చర్లలో కరెంటు కోతలతో వ్యాపారులు ఆగ్రహం

జడ్చర్లలో కరెంటు కోతలతో వ్యాపారులు ఆగ్రహం

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా: జడ్చర్ల పట్టణం సాయి నగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, సిగ్నల్ గడ్డ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కరెంటు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ముందస్తు టైం టేబుల్ తెలపకపోవడం ఆందోళన కలిగిస్తుంది కరెంటు లేక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని కొందరు వ్యాపారవేత్తలు వాపోయారు. ఫిర్యాదు కోసం అధికారులకు ఫోన్ చేస్తే లైన్మెన్‌కు చేయమని చెబుతున్నారు. లైన్మెన్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు.“ఇంత దారుణమైన కరెంటు కోతలు ఎప్పుడూ చూడలేదు. గత పదేళ్ల పాలనలో ఒక్క క్షణం కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రతి గంటా నరకం చూస్తున్నాం. రాత్రి 12:30కు పోయి 2:30కు వస్తోంది” అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!