ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం – ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఊర్కొండపేట గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దేవస్థానం నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చింతల మనోహర్ రెడ్డితో పాటు పాలకమండలి డైరెక్టర్లను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం నూతన పాలకమండలి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ఆలయ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, ప్రజల నమ్మకానికి అనుగుణంగా సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రగతికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!