జడ్చర్లలో ఘోర ప్రమాదం: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి మహిళా కూలీ మృతి

జడ్చర్లలో ఘోర ప్రమాదం: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి మహిళా కూలీ మృతి

TBN LIVE


జడ్చర్ల మే 27 బుధవారం మండలం పోచమ్మ గడ్డ తండాకు చెందిన మహిళా కూలీ నిర్మాణ స్థలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.కావేరమ్మ పేటలో వేణుగోపాల్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌ను మేస్త్రీ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీల తో నిర్మిస్తున్నారు. పోచమ్మ గడ్డ తండాకు చెందిన మూడవత్ శారద (40), భర్త రవి, కులం లంబాడ, ప్రతిరోజూ ఈ నిర్మాణ పనులకు కూలీగా వచ్చేది అన్నారు. ఈరోజు 4వ అంతస్తులో పని చేస్తూ క్రేన్ ద్వారా వస్తున్న సిమెంట్ సంచులను తీసుకుంటుండగా శారద ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శారద మృతితో కుటుంబ సభ్యులు, తోటి కూలీలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!