జడ్చర్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలు వాయిదా

జడ్చర్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలు వాయిదా

TBN LIVE
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన వాయిదా పడింది.వివరాలు:తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు, బుధవారం 27-05-2026 న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన వాయిదా పడినట్లు మంత్రి కార్యాలయం నుండి అధికారికంగా ప్రకటించారు.మంత్రి ప్రైవేట్ సెక్రటరీ మరియు ఓఎస్‌డీ యు. శశిధర్ రెడ్డి http://T.P.No.52/2026 ద్వారా ఈ మేరకు వైర్‌లెస్ మెసేజ్ జారీ చేశారు.ఈ సమాచారాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్పీలు, హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్ జోన్ ఐజీపీలకు పంపారు.
అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, చీఫ్ ఇంజనీర్, జిల్లా పౌరసరఫరాల అధికారికి కూడా తెలియజేశారు.తదుపరి సమాచారం కోసం డ్యూటీ పిఏ కె. వేణు ప్రసాద్ 9949358848, పిఎస్ఓ 9177165762 నంబర్లను సంప్రదించాలని నోట్‌లో పేర్కొన్నారు.
మంత్రి కొత్త పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!