ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే అనుచిత వ్యాఖ్యలు జడ్చర్లలో కాంగ్రెస్ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోడీపై మల్లికార్జున్ ఖర్గే అనుచిత వ్యాఖ్యలు జడ్చర్లలో కాంగ్రెస్ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం

TBN LIVE

జడ్చర్ల ; ఏప్రిల్ 22 ;భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రవాది అని సంబోధించడాన్ని నిరసిస్తూ, జడ్చర్ల మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం మరియు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు, జడ్చర్ల మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ముదిరాజ్ నేతృత్వంలో ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానిపై ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఖర్గే వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమేష్ జి, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్, ఎడ్ల శ్రీనివాస్ గౌడ్, సకనీ మల్లేష్ యాదవ్, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బరిగల శ్రీశైలం ముదిరాజ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు గణపతి గుప్తా పాల్గొన్నారు. అలాగే ఓబిసి మండల అధ్యక్షుడు శివకుమార్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు కాశన్న, బిజెపి నాయకులు తిరుపతి, ధనుంజయ్, లింగం, యాదగిరి, జీవన్, విష్ణువర్ధన్, కె. శేఖర్, కె. శ్రీను, పవన్ తదితరులు పాల్గొన్నారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!