కొండా సురేఖ అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖ అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TBN LIVE
కొండా సురేఖ అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జడ్చర్ల: మంత్రి కొండా సురేఖ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండా సురేఖ అంశంపై ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్ మీట్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళల కన్నీరు భూమిని తాకితే సునామీగా మారుతుంది మహిళలను తాను ఎంతో గౌరవిస్తానని, మహిళలకు సంబంధించిన అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తన విధానం కాదని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు."నేను ఆడవారిని గౌరవిస్తాను. ఇంట్లో మా తల్లి గానీ, ఇతర మహిళలు గానీ నన్ను ఎన్ని తిట్టినా వారి విషయంలో నేను స్పందించి మాట్లాడను. మహిళల కన్నీరు భూమిని తాకితే సునామీగా మారుతుంది" అని ఆయన అన్నారు.కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్ మీట్ కు తనను ఎవరూ పిలవలేదని, ఎవరూ ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పారు.
అంతేకాదు, ఫైళ్ల క్లియరెన్స్ కోసమే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. "మా ముఖ్యమంత్రి అంతకు దిగజారలేదు" అని వ్యాఖ్యానించారు.జడ్చర్ల నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల అంశంపై తన పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. "నన్ను గెలిపించిన జడ్చర్ల ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పెండింగ్ బిల్లుల కోసం కొట్లాడతాను. బిల్లులు ఇవ్వకపోతే దీక్షకు దిగుతాను. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. "చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన అనుభవమంత నా వయస్సు కూడా లేదు. ఆయన విషయంలో నేను ఏమీ మాట్లాడలేను" అని పేర్కొన్నారు.రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించిన నేపథ్యంలో, ఇప్పుడు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!