రాబోయే వేసవి కాలానికి త్రాగునీరు సమస్య లేకుండా ముందస్తు చర్యలు
November 04, 2026
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ACLB మహబూబ్‌నగర్ మరియు జడ్చర్ల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీ మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం. గిరీష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గంగాపూర్, కావేరమ్మపేట ప్రాంతాలలో జరుగుతున్న నీటి సంపుల పునరుద్ధరణ, నూతన బోర్ల ఏర్పాటు పనులను వారు పరిశీలించారు. అలాగే మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చూడాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
Tags
