జడ్చర్ల మున్సిపాలిటీ స్టేడియం గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఫోటోగ్రాఫర్ల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు యువనేత జరుపుల భాస్కర్ నాయక్ హాజరై టాస్ వేసి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భాస్కర్ నాయక్ జడ్చర్ల రాజకీయాలపై నిప్పులు చెరిగారు.అధికార ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మధ్య కొనసాగుతున్న విమర్శల పర్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ..."ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఎన్నో పోరాటాలు, యువత ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో యువతకు మంచి చెప్పాల్సింది పోయి, మీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం. మీరు ఇలా ఉంటే ప్రజల్లోకి వెళ్లి ఎలా ఓట్లు అడుగుతారు? మీ ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.ఇకనైనా విమర్శలు మాని జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. గత కొంతకాలంగా ఏలినో ప్రభావంతో రైతులు అవస్థలు పడుతుంటే, మీరు కోట్లల్లో పెట్టుబడులు పెట్టామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే మిమ్మల్ని ప్రశ్నిస్తాం" అని హెచ్చరించారు.
జడ్చర్ల క్రికెట్ టోర్నీలో యువనేత జరుపుల భాస్కర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు
November 01, 2026
Tags
