జడ్చర్లలో ప్రమాదకర ఇనుప విద్యుత్ స్తంభాలు - తొలగించాలని వినతి

జడ్చర్లలో ప్రమాదకర ఇనుప విద్యుత్ స్తంభాలు - తొలగించాలని వినతి

TBN LIVE
జడ్చర్ల, అక్టోబర్ 28: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ప్రమాదకరంగా మారిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు విద్యుత్ శాఖను కోరారు.
ఈ మేరకు బీజేపీ నాయకులు పిట్టల నరేష్, ముష్టి రమేష్ కుమార్, బుక్క యాదగిరి, గుండు నరసింహ రాజు తదితరులు TGSPDCL సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (AE) కు వినతిపత్రం అందజేశారు.
కావేరమ్మపేటలో పలు వీధుల్లో పూర్వకాలంలో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వర్షాలు, తేమ కారణంగా అడుగుభాగంలో తీవ్రంగా తుప్పు పట్టి బలహీనపడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఈ స్తంభాల ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ప్రసరించే ప్రమాదం ఉందని, దీనివల్ల చిన్నారులు, బాటసారులు, మూగజీవాలు విద్యుత్ షాక్కు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా తక్షణమే ఇనుప స్తంభాల స్థానంలో నూతన సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రజా భద్రత కాపాడాలని విజ్ఞప్తి చేశారు.



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!