జడ్చర్లలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవం

జడ్చర్లలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవం

TBN LIVE
జడ్చర్ల, మే 31: జడ్చర్ల పట్టణంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జీలు బిర్లా ఎల్లయ్య యాదవ్, శాగంటి మనోహర్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాను ఎగరవేశారు.ఈ మహోత్సవానికి మహబూబ్నగర్ జిల్లా జెండా పండుగ ఇన్చార్జి మెట్టుకాడి ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, జడ్చర్ల నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్ ప్రవీణ్ ముదిరాజ్ ప్రత్యేకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే పార్టీ లక్ష్యమని వారు పేర్కొన్నారు.జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు గంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన అజీజ్, ఆంజనేయులు, కురుమయ్య, జగత్‌లకు నియోజకవర్గ ఇంచార్జీలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ధీరజ్ ముదిరాజ్, భగీరథ ముదిరాజు, కృష్ణారెడ్డి, మల్లేష్, జగదీశ్వర్ ముదిరాజ్, మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ అజి, శ్రీశైలం గౌడ్, వినయ్ కుమార్, భాగ్యరాజ్, జంగం శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, నాని, చింటూలతో పాటు బాల్నగర్ మండల నాయకుడు సుమన్ నాయక్, రాజాపూర్ మండల నాయకుడు రాజేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!