తిమ్మాజీపేట్, మే 9 : నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట్ మండలం మారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్‌కు చెందిన జీఎన్‌ఐటీఎస్ (GNITS) స్వచ్ఛంద సంస్థ భారీ విరాళం అందజేసింది. సంస్థ ప్రెసిడెంట్ స్పందన నేతృత్వంలో సుమారు లక్ష రూపాయల విలువైన బెంచీలు, టేబుల్స్, ఇతర విద్యా సామగ్రిని శుక్రవారం పాఠశాలకు బహూకరించారు.ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ.. మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థులు మెరుగైన వసతులతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సోమయ్య, మనోహర్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు అండగా నిలిచిన NGO సభ్యులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
