మాజీ ఎమ్మెల్యే చేసిన అక్రమాలన్నీ త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తాం
జడ్చర్ల అభివృద్ధికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అహర్నిశలు కృషి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి : కాంగ్రెస్ నాయకులు
జడ్చర్లకు త్రిబుల్ ఐటీ, యంగ్ ఇండియా స్కూల్, నవోదయ విద్యాలయాల మంజూరుతో విద్యారంగానికి కొత్త ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘనత
మా ఎమ్మెల్యే గారిపై అసత్య ప్రచారం చేస్తే సహించం – బిఆర్ఎస్ నేతలకు హెచ్చరిక
జడ్చర్ల, మే 11:జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జడ్చర్ల నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, భూకబ్జాలు, అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గత పది సంవత్సరాల పాలనలో జడ్చర్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించి, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు కలిసి నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూకబ్జాలు,భూ దందాలు నిర్వహించి పేద ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చేసిన తప్పిదాల కారణంగానే మార్కెట్‌కు చెందిన యాదగిరి అనే వ్యక్తి సస్పెండ్ అయ్యాడని పేర్కొన్నారు.గత ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులకంటే రెండు పోలీస్ స్టేషన్లు కావాలని అడిగిన అసమర్థ మాజీ ఎమ్మెల్యే అని విమర్శించారు. జడ్చర్ల ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా స్వార్థ రాజకీయాలు మాత్రమే చేశారని అన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.మున్సిపాలిటీలో నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, ప్రజా సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ బలపదం చేస్తూ, జడ్చర్ల నియోజకవర్గానికి త్రిబుల్ ఐటీ కళాశాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నవోదయ విద్యాలయాలను మంజూరు చేసిన ఘనత మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి దక్కుతుందన్నారు.బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మాజీ ఎమ్మెల్యే మరియు బిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి బండారాన్ని ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.చివరగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, జడ్చర్ల ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, సుదర్శన్ గౌడ్, నిత్యానందం, యాదయ్య, ఆనంద్, అల్వాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మాలిక్ షాకీర్, కుమ్మరి రాజు, చైతన్య చౌహన్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
