జడ్చర్ల, మే 07 జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే, పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. జడ్చర్ల ప్రజలు చిరకాలంగా రెవెన్యూ డివిజన్ కోసం డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. డివిజన్ కేంద్రంగా మారేందుకు జడ్చర్లకు అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఇతర ప్రధాన డిమాండ్లు కార్యాలయ భవనాలురాజాపూర్, ఊర్కొండ మండలాల్లో తాసిల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలి. జడ్చర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు చేయాలి.మహిళా సంఘాలకు స్థలం జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట సర్వే నంబర్ 434లోని 2000 గజాల స్థలాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు కేటాయించి, పెట్రోల్ బంక్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలి.ఎమ్మెల్యే వినతులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.
జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలి మంత్రి పొంగిలేటికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినతి
May 07, 2026
Tags
