గంగాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల షురూ: ఆకర్షణీయమైన వసతులతో ఉచిత విద్యావకాశాలు

గంగాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల షురూ: ఆకర్షణీయమైన వసతులతో ఉచిత విద్యావకాశాలు

TBN LIVE
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల
విద్యా రంగానికి ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం తీసిపోవని జడ్చర్ల మండలం, గంగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థులు మరోసారి నిరూపించారు. తాజాగా విడుదలైన 2025-26 విద్యాసంవత్సరం SSC (పదవ తరగతి) ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, రికార్డు స్థాయి మార్కులతో గ్రామానికి మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.
ఈ ఫలితాల్లో పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు
వీరితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు 400 కి పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారిలో ముఖ్యులు పాఠశాలకు చెందిన సుమారు 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు.
ఉపాధ్యాయుల కృషి.. తల్లిదండ్రుల హర్షం:
"ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" స్ఫూర్తితో ఉపాధ్యాయులు అందించిన నాణ్యమైన బోధన, ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభించే నాణ్యమైన విద్యను, వసతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అంతరాలు లేని చదువు కోసం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం అనంతప్ప పాఠశాల యాజమాన్యం మరియు నెక్కొండ గ్రామ సర్పంచ్ కె కృష్ణయ్య గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు మరియు విద్యాశాఖ అధికారులు అభినందించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు (చేరికలు) కూడా పాఠశాలలో ప్రారంభమైనట్లు వారు తెలిపారు.మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీది - మీ పిల్లల పూర్తి బాధ్యత మాది" అనే నినాదంతో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) కొత్త విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సంయుక్తంగా ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఈ పాఠశాలలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో బోధన అందుబాటులో ఉంది.
పాఠశాల ప్రత్యేకతలు మరియు వసతులు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు లభించే ఉచిత సౌకర్యాలతో పాటు, ఈ పాఠశాల పలు రకాల ఆధునిక విద్యా విధానాలను అందిస్తోంది డిజిటల్ బోధన IFB ప్యానల్స్ మరియు కంప్యూటర్ల ద్వారా ఆధునిక డిజిటల్ విద్య.ఉచిత పంపిణీ ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ మరియు రెండు జతల స్కూల్ యూనిఫార్మ్స్.ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యా బోధన.ఉత్తమ వసతులు విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం మరియు బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్లు, మరుగుదొడ్లు.ప్రత్యేక శ్రద్ధ ఒత్తిడి లేని విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, మరియు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.అదనపు తరగతులు ఇంగ్లీష్, గణితములపై ప్రత్యేకంగా అదనపు తరగతుల నిర్వహణ.నిరంతర మూల్యాంకనం విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన మరియు CCE (నిరంతర సమగ్ర మూల్యాంకనము) అమలు.ఇతర వసతులు గ్రంథాలయ పుస్తకాల నిర్వహణ మరియు విద్యార్థులకు ఉచిత డాక్టర్లచే వైద్య పరీక్షలు.కార్యక్రమాలు యోగా, ధ్యానం, వ్యాసరచన, క్విజ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.ఉచిత విజ్ఞాన విహారయాత్ర 6, 7వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచితంగా సైన్స్ టూర్ (విజ్ఞాన విహారయాత్ర) ఏర్పాటు చేయబడుతుంది.
విద్యార్థుల ప్రగతికి ప్రత్యేక చర్యలు:ఉదయం అల్పాహారం ఈ విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం పూట ఉచితంగా అల్పాహారం అందించబడుతుంది.10వ తరగతి ప్రత్యేక శ్రద్ధ: టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం జనవరి నుండి మార్చి వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి, సాయంత్రం వేళల్లో ఉచితంగా స్నాక్స్ అందిస్తారు.తల్లిదండ్రుల సమావేశం: ప్రతి నెల మూడవ శనివారం నాడు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థుల ప్రగతిపై సమీక్షిస్తారు.నో బ్యాగ్ డే విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి 4వ శనివారం నాడు 'నో బ్యాగ్ డే'గా పాటిస్తారు. తెలిపారు అంతేకాకుండా పాఠశాలకు 3 లేదా 5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యానికి నేరుగా పిల్లల తల్లిదండ్రుల అకౌంటు ఖాతాలోకి నెలకు 600 చొప్పున వేయడంతోపాటు తరగతులను బట్టి నోట్ బుక్కులు పాఠ్యపుస్తకాలు బ్యాగ్ టై బెల్ట్ లకు సంబంధించి కిట్టు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ బడిలో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!