తేదీ: 04.06.2026
*ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు – అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ*
*హెలిప్యాడ్, సభా ప్రాంగణాలు, రిజర్వాయర్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన*
*1,406 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు*
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారి శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కరువేనా రిజర్వాయర్, వుదండపూర్ రిజర్వాయర్, జడ్చర్ల పట్టణంలోని పబ్లిక్ మీటింగ్ ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.
జడ్చర్లలోని ASR గార్డెన్ నందు నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
ఈ బందోబస్తు విధుల్లో మొత్తం 1406 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొంటున్నారు. వీరిలో 3 - SPs,
3 Addl SPs
16 DSPs
43 CI/RIs
94 SIs
315 ASIs/HCs,
614 PCs
124 WPCs
195 HGs ఉన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలకోటి, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
