జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "నోవస్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్" (కార్డియాలజీ & డెర్మటాలజీ) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. బాదేపల్లి కల్వకుర్తి రోడ్డులోని ప్రేమ్‌రంగా గార్డెన్ సమీపంలో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, క్లినిక్‌ను రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్లినిక్ నందు గుండె జబ్బుల విభాగం (కార్డియాలజీ), చర్మ వ్యాధుల విభాగం .నిర్వాహక వైద్యులు: కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ (MD, DM), డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రతీమ నాగెల్లి (MD) జడ్చర్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వారి కుటుంబం మొత్తం డాక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు అత్యాధునిక గుండె మరియు చర్మ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ ప్రణయ్, డాక్టర్ ప్రతీమలు మాట్లాడుతూ.. జడ్చర్ల పరిసర ప్రాంతాల ప్రజలకు నమ్మకమైన, మెరుగైన స్పెషాలిటీ వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వైద్య సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
