జడ్చర్ల, జూన్ 15: జడ్చర్లలో టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.ఉదండాపూర్ ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించిన ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ నిర్వాసితుల కోసం రూ.631 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జడ్చర్లకు బైపాస్, రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ జీవితం సందర్భంగా జులై 4 లేదా 5న మిడ్జిల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, మిడ్జిల్-ఉర్కొండ మండలాలకు భారీ అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. రంగనాయకస్వామి గుట్టపై భారీ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు.
జడ్చర్లలో BLAలకు SIRపై శిక్షణ: ఉదండాపూర్ ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమన్న ఎమ్మెల్యే
June 15, 2026
Tags
