జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్ఓ మ్యాపింగ్, ఎస్ఐఆర్–2026పై సమావేశం

జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్ఓ మ్యాపింగ్, ఎస్ఐఆర్–2026పై సమావేశం

TBN LIVE
 జడ్చర్ల: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి శ్రీమతి జె.ఎల్.బి హరి ప్రియ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీఎల్ ఓ మ్యాపింగ్, ఎస్ఐఆర్–2026 ఏర్పాట్లపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు. రాబోయే ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్–2026ను పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బూత్ లెవల్ ఆఫీసర్ల కేటాయింపు, పోలింగ్ స్టేషన్ వారీగా డేటా సరిచూసే ప్రక్రియపై చర్చించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు కార్యాచరణ వివరించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, లోపాలు లేకుండా తయారయ్యేలా అన్ని పార్టీల సహకారం అందించాలని కోరారు.
సమావేశంలో ఎస్ఐఆర్–2026 షెడ్యూల్, అభ్యంతరాల స్వీకరణ తేదీలు, బీఎల్ఓల బాధ్యతలపై వివరణ ఇచ్చారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!