ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం "ప్రజావాణి" కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్‌లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 4 ప్రకారం ప్రతి సోమవారం ఈ ప్రజావాణి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై నేరుగా అధికారులకు ఫిర్యాదులు సమర్పించి వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
మొదటి రోజు జరిగిన ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను సమర్పించారు. ఈ ప్రజావాణిలో మండల స్థాయికి చెందిన 24 శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరై, ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీడీఓ అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ప్రతి సోమవారం జరిగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
