గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ నూతన ప్రవేశ ద్వార (కమాన్) నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం

గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ నూతన ప్రవేశ ద్వార (కమాన్) నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం

TBN LIVE
మహబూబ్నగర్ , జడ్చర్ల: ఆగస్టు 18
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ అర్చ్ (కమాన్) పునర్నిర్మాణానికి దేవస్థాన కమిటీ సన్నాహాలు చేస్తోంది.గత కొన్ని నెలల క్రితం అధిక లోడుతో వచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి ఢీకొట్టడంతో, ఈ చారిత్రాత్మక ఆలయ ప్రవేశ కమాన్ పూర్తిగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై భక్తులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, ఆలయ కమిటీ పాత కమాన్ స్థానంలో సరికొత్త, అత్యంత వైభవవంతమైన ప్రవేశ ద్వారాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ, ఘన స్వాగతం పలికేలా ఈ నూతన నిర్మాణ నమూనాను రూపొందిస్తున్నారు. ఆలయ పూర్వ వైభవాన్ని ప్రతిబింబించేలా, ఆధునిక హంగులతో కూడిన ప్రవేశ ద్వార నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!