జడ్చర్ల సిగ్నల్ గడ్డ పాతవంతెన కూల్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనుమతులు జారీ

జడ్చర్ల సిగ్నల్ గడ్డ పాతవంతెన కూల్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనుమతులు జారీ

TBN LIVE
జడ్చర్లలో సిగ్నల్డ్డపై నేటినుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నూతన బ్రిడ్జిపైనే రాకపోకలు, బారికేడ్ల నిర్మాణం
జడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్గడ్డ
రైల్వే పాతవంతెన కూల్చేందుకు ఎట్టకేలకు దక్షి ణమధ్య రైల్వే అధికారులు అనుమతులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి 167వ నెంబరు జాతీయ రహదారి సిగ్నల్గడ్డపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. కొత్తవంతెనపైనే పూర్తిగా రాకపో కలు సాగించేలా బారీకేడ్లు నిర్మించనున్నారు. ఇం దుకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. రాయ చూర్ నుంచి కోదాడ వరకు నిర్మిస్తున్న 167వ నెం బరు జాతీయ రహదారిపై మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఐసీ కార్యాలయ నుంచి డిగ్రీ కళాశాల, మహిళా వసతిగృహం వరకు మొత్తం 750మీటర్ల రోడ్డు విస్త పనులు కొనసా గుతున్నా యి. అం దులో భాగంగానే ఇటీ వల రైల్వేలైన్పై నూతన వంతెన నిర్మాణం పూర్తయి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పాత వంతెన కూల్చివేసి దానిస్థానంలో మరో వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దాదాపుగా 6నెలల నుంచి అనుమతుల కోసం వేచి ఉండగా ఇటీవల లభించాయి. దీంతో పాతవంతె నను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. అం దులో భాగంగానే వాహనాల రాకపోకలన్నీ ఇకపై నూతన వంతెనపై నుంచి సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు1993లో పునర్నిర్మాణం
ప్రస్తుతం ఉన్న పాత రైల్వేబ్రిడ్జ్ 1995లో పునః నిర్మాణం చేశారు. అంతకుముందు ఈ ప్రాం తంలో రైల్వేలైన్ వేసిన సమయంలో నిర్మించిన వంతెన ఉండేది. మీటర్ గేజ్ రైళ్లకోసం అప్పట్లో వంతెన నిర్మించారు. కాల క్రమేణా రైల్వేలైన్ మీటరేజ్ నుంచి బ్రాడ్జ్గా మారడంతో 1993లో బ్రిడ్జిని విస్తరిస్తూ నిర్మించారు. అదే సమయంలో డబుల్ న్ వేసేందుకు అనుకూ లంగా నిర్మాణం సాగించారు. ఇన్నాళ్లకు మరో సారి బ్రిడ్జిని తొలగించాల్సిన ఆవశ్యకత ఏర్ప డింది. పట్టణంగుండా 167 జాతీయ రహదారి వెళ్తుండడంతో ఫోర్లైన్స్ తప్పనిసరిగా మారిం ది. దీంతో మొదట రెండులైన్ల రహదారికి అను కూలంగా బ్రిడ్జి నిర్మించారు. అప్పటివరకు పాత బ్రిడ్జిపై రాకపోకలు సాగించారు. ఇటీవ ల వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా రెండు బ్రిడ్జిలపై వాహనాలు రాకపోకలు సాగి స్తున్నారు. రైల్వే అనుమతులు లభించడంతో తప్పనిసరిగా వంతెన తొలగించడం అనివార్య మైంది. దీంతో శుక్రవారం నుంచి నూతన బ్రిడ్జిపైనే అన్ని వాహనాల రాకపోకలకు బారికేడ్ల నిర్మించనున్నారు. పాతబ్రిడ్జిపై బీటీ తొలగించడంతోపాటు కూల్చేందుకు అన్నిఏ ర్పాట్లు చేసుకోనున్నారు. ఆదివారం రైల్వేశాఖ ఇచ్చే సమయంలో వంతెన పూర్తిగా తొలగిం చేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిడ్జి తొలగిం చాక మరో ఆరునెలల నుంచి ఏడాది వరకు సమయం పట్టే అవకాశాలున్నాయి.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!