జడ్చర్ల, టిబిఎన్ లైవ్ న్యూస్: జడ్చర్ల రహదారులపై బుధవారం ఇసుక టిప్పర్లు పరుగులు పెట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టణ నలువైపులా 167, 44 జాతీయ రహదారులపై నిమిషానికి ఒకటి చొప్పున రాకపోకలు సాగించాయి. స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.మిడ్జిల్ మండలం కొత్తపల్లి లో పట్టా భూముల నుంచి ఇసుక తీసి, తర లించేందుకు మైనింగ్ శాఖ అనుమతించింది. బుధవారం నాడు పదుల సంఖ్యలో ఇసుకలోడు వాహనాలు పరుగులు పెట్టినా వే బిల్లులు ఉన్నాయా? ఒక రోజు ఎంత ఇసుక, ఎంత లోతు తీయాలి, ఎక్కడికి తర లించాలి అనే నిబంధనలు అధికారులు పట్టించుకోలేదు.
ముఖ్య నేత అనుచరులేనా?..
గతంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు ఇసుక గుత్తేదారులకు మెలిక పెట్టడం, సంఘాలు, పార్టీల నాయకులు అనుమతి రద్దు చేయాలనే ఒత్తిడి మేరకు కొన్ని రోజులు రవాణా నిఘా పోలీసు స్టేషన్ సమీపంలో టిప్పర్లు నిలిచిపోయింది. తాజాగా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఊపందుకోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఓ ముఖ్య నేత అనుచరుల కనుసన్నల్లో జరిగినట్లు చర్చించుకుంటున్నారు.
