UG ఫెస్ట్ 2026 విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి

UG ఫెస్ట్ 2026 విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి

TBN LIVE
బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల అందు " UG ఫెస్ట్ 2026 " పేరిట రెండురోజుల పాటు నిర్వహించిన విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనoగా ముగిసాయి. పోస్టర్ మేకింగ్, meme క్రియేషన్, ఫోటోగ్రఫీ, స్కిట్, పాటలు,నృత్య పోటీలతోపాటు టగ్ ఆఫ్ వార్ వంటి ఎంటర్టైన్మెంట్ పోటీల ను రెండవ రోజు నిర్వహించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రిన్సిపాల్  ప్రొఫెసర్ సుకన్య తన సందేశంలో పేర్కొన్నారు.ఈ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 20కి పైగా కళాశాలల నుండి 700 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ బహుమతులు, సర్టిఫికెట్స్ ను అందించినట్లు కన్వీనర్ సతీష్ రెడ్డి, కో కన్వీనర్ పుష్పలత తెలియజేశారు.విదార్థులలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కన్వీనర్,కో  కన్వీనర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు భారీ ఎత్తున వివిధ కళాశాలల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!