నల్లకుంట, బతుకమ్మ కుంట, నేడు చేపల పెంట

నల్లకుంట, బతుకమ్మ కుంట, నేడు చేపల పెంట

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం లోని గత సంవత్సరం లో నల్లకుంట చెరువును అభివృద్ధి చేసి బతుకమ్మ కుంటగా పేరు పెట్టి బతుకమ్మ సంబరాలను ఇక్కడ పట్టణం మధ్యలో కృషి చేసిన పాలకులు బుధవారం జరిగిన ఘటన లో భాగంగా చెరువులో లక్షల సంఖ్యలో చేపలు మృతి చెందాయి అందుకు ఆ ఘటనకు సంబంధించి  కారకులను వెలికి తీసేందుకు ప్రయత్నంలో ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది మూడు రోజుల క్రితం నీటిలో చనిపోయిన చేపల వల్ల నీటి కాలుష్యం ఎక్కువైతున్న సంగతి మరిచిపోయారు. కుంట దగ్గర ఉన్న పార్కులోకి ప్రశాంతత గురించి వచ్చే ప్రజలకు నీటిలో చనిపోయిన చేపల దుర్వాసన ముక్కులు పగిలేలా నీటి కాలుష్యమే కాకుండా గాలి కాలుష్యం కూడా ఎక్కువ కావడంతో భరించలేమంటూ ఇట్టి విషయంపై వెంటనే చర్యలు తీసుకుని తొందరగా నీటి నుండి చనిపోయిన చేపలను తొలగించాలని పాలకులను పట్టణ ప్రజలు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా కుంట మూడు పక్కల ప్రహరీ జాలీలు ఉన్న ఒక పక్క లేకపోవడం పట్ల ప్రజలు ఎక్కువగా తిరిగే కట్ట రోడ్డు గా కావడంతో ప్రమాదాలు జరగకుండా మరోవైపు కూడా ప్రహరి జాలి ఏర్పాటు చేయాలని పట్టణ స్థానిక ప్రజలు పాలకులను కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!