ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా నోట్బుక్స్ పంపిణీ
January 06, 2026
జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెక్కొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ యు,పి,ఎస్ నెక్కొండ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పండ్లు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జడ్చర్ల నియోజకవర్గ ప్రజల అండదండ ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని నూతన అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. ఇందులో భాగంగా మహిళా సంఘం అధ్యక్షురాలు టి లింగమ్మ, మాజీ సర్పంచ్ యోగేశ్వర్ రెడ్డి, నాయిని రవీందర్ రెడ్డి ,బెల్లం వెంకటయ్య బొల్లె పోగు రాఘవేందర్, బెల్లం మహేష్ ,సాకలి యాదయ్య ,పారుపల్లి శేఖర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గౌడ్, ఉపాధ్యాయురాలు అమూల్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags
