మహిళా శక్తికరణకు పెద్ద అడుగు

మహిళా శక్తికరణకు పెద్ద అడుగు

TBN LIVE

జడ్చర్లలో మహిళా శక్తికరణకు పెద్ద అడుగు సెట్విన్ శిక్షణతో ఉపాధి మహిళల పురోగతికి కీలక మద్దతు
నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు జడ్చర్ల లో మహిళా సాధికారతకు నూతన ఊపు 290 మందికి స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకీ నగర్ సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న  టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన 290 మంది మహిళా అభ్యర్థులను ప్రోత్సహిస్తూ, నేడు జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి  స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న యువత, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావడానికి సెట్విన్ వంటి శిక్షణ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.అభ్యర్థులు క్రమశిక్షణతో శిక్షణలో పాల్గొని, నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధి రూపంలో మలుచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలను జడ్చర్లలో ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు ,అధికారులు, సెట్విన్ శిక్షకులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!