ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జడ్చర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ప్రత్యేక రోజులు ఉన్న పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని ఎవరికి తెలియదు కానీ పురుషుడిగా వారి త్యాగాలు కష్టాలు గుర్తించి పురుషుల కూడా ఒక దినోత్సవం ఉండాలని 1999లో అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని ఐక్య సమితి గుర్తించింది. పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం, సమాజం, దేశం నిర్మాణం, అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది. గత కొన్ని దశాబ్దాలుగా, మహిళా సాధికారత కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పురుషుల ఆరోగ్యం, పురోగతిపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురుషుల మానసిక వికాసం, సానుకూల గుణాల ప్రశంసలు, లింగ సమానత్వం లక్ష్యంగా జరుపుకుంటారు. పురుషులు ఎన్ని త్యాగాలు చేసిన వారి శ్రమను గుర్తించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కడమంచి చెన్నయ్య , వుమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమని రాధాకృష్ణ ,గోపాల్ గౌడ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
