బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి రాహుల్ గాంధీ తో మాట్లాడి త్వరలో ప్రారంభమయ్యే శీతకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని, బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేసేవరకు ఒత్తిడి తేవాలని, రాజకీయ మైలేజ్ కోసం మంత్రంగా ధర్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి రాదని అన్నారు. దేశంలోని మెజార్టీ ప్రజలైన బీసీల 70 సంవత్సరాలు ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పార్లమెంట్లో బీసీరిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు బీసీలకు చట్టబద్ధతతో కూడుకున్నారు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు,విద్యా,ఉద్యోగ,ఉపాధి, రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని లేనియెడల రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా రాజకీయ సమాధి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
