నస్రుల్లాబాద్ బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

నస్రుల్లాబాద్ బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

TBN LIVE
తేది:13.05.2026, జడ్చర్ల నియోజకవర్గం.
జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ఇలాంటి ఉత్సవాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!