గంగాపూర్‌లో PACS వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు, కొనుగోలు కేంద్రంలో సౌకర్యాల పరిశీలన
జడ్చర్ల, మే 21జడ్చర్ల మండలం గంగాపూర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన PACS వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను మోసం చేసే ట్రేడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రైతులు మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలి.
ప్రభుత్వ మద్దతు ధర పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.కొంతమంది ట్రేడర్లు పచ్చి మొక్కజొన్నను తక్కువ ధరకు కొని, షెడ్లలో నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రాత్రి మార్కెట్ యార్డు సందర్శనలో రైతుల ధాన్యం బయట, ట్రేడర్ల ధాన్యం షెడ్లలో ఉన్నట్లు గుర్తించి డీజీ విజిలెన్స్ చౌహాన్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, PACS నిర్వాహకులు, మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం" అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
--
