DMHO డాక్టర్ శ్రీనివాసులు గారు స్వయంగా కాలనీలో పర్యటించి విచారణ చేశారు. రోగి వివరాలు తెలుసుకుని, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, సాయంత్రం పూట తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించాలని కోరారు.అలాగే ఫీల్డ్ స్టాఫ్ అందరూ రోజూ ఫీవర్ సర్వే చేయాలని, రెండు మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉన్న వారిని వెంటనే UPHC కి తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో DEMO టీమ్, DMO టీమ్, UPHC మెడికల్ టీమ్ పాల్గొన్నారు.
